హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది చేసే పొద్ద పొరపాటు

updated: March 16, 2018 17:59 IST

గతంలోకంటే ఇప్పుడు ఆరోగ్య బీమాపాలసీల గురించి  బాగా ప్రచారం జరుగుతోంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌కు పోటీగా రిలయన్స్‌, టాటా వంటి కార్పొరేట్‌ కంపెనీలు, జాతీయ బ్యాంక్‌లు హెల్త్‌పాలసీల రంగంలోకి అడుగుపెట్టి, వీటిని బాగా ప్రొమేట్‌ చేయటమే దీనికి కారణం. అయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు  చేసే కొన్ని పొరపాట్లు తర్వాత ఆ పాలసీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అందనివ్వకుండా చేస్తాయి. అందులో చాలా మంది చేసే ఓ పెద్ద పొరపాటు ఒకటుంది.

ఎలాగైనా సరే తక్కువ ప్రీమియంకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనే లక్ష్యంతో చాలామంది తమ హెల్త్‌ హిస్టరీ ని దాచేస్తుంటారు. దాదాపు ఏ బీమాకంపెనీ కూడా మధుమేహం, బీపి లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే పాలసీ ఇవ్వవు. అందుకు జరిగే ట్రీట్‌మెంట్‌ ఖర్చులూ భరించవు. అలాంటి ధీర్ఘకాలిక, ప్రాణాంతక ఆరోగ్య సమస్యల్ని దాచేసి తప్పుడు సమాచారంతో పాలసీని తీసుకుంటే సమయం వచ్చేటప్పటికీ క్లెయిమ్‌ని ఇవ్వడానికి నిరాకరిస్తాయి.  కాబట్టి వాస్తవాలు తెలియజేయండి. దీనివల్ల కాస్త ప్రీమియం పెరిగినా తర్వాత తర్వాత  ఇబ్బందులు తలెత్తవు.  

అలాగే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఏయే వ్యాధులకు, చికిత్సలకు పరిహారం లభిస్తుందనే అంశాన్ని ముందుగా తెలుసుకోవాలి.  మనం పూర్తి చేసే దరఖాస్తు పత్రంలోనే ఆ వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. పాలసీ తీసుకున్న ముప్పయి రోజుల వరకు ప్రమాదం మినహా ఇతర అనారోగ్యాలకు ఇన్సూరెన్స్‌ వర్తించదు. ఇలాంటి ఎన్నో నిబంధనలు ఉంటాయి. అవన్నీ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పాలసీదారుడిదే. 

comments